![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ చేరింది. హౌస్ లో నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్, రోహిణి, ప్రేరణ, విష్ణుప్రియ మొత్తంగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. కంటెస్టెంట్స్ మధ్య ఓట్ అప్పీల్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో రోహిణి, అవినాష్ ల ఆటతీరు ఆకట్టుకుంది.
నిన్నటి ఎపిసోడ్‌లో ముందుగా ఓ టాస్కు పెట్టాడు. ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి మూడో అవకాశాన్ని కల్పిస్తూ ఆడియన్స్‌తో కనెక్ట్ అయి మీరు విన్నర్ అవ్వడానికి ఒప్పించేందుకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ పవర్ ఫ్లాగ్.. ఈ ఛాలెంజ్‌లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా లైన్స్ లోపల ఉన్న ఫ్లాగ్స్‌ని తీసుకోవడానికి ప్రయత్నించడం.. ప్రతీసారీ బజర్ మొగగానే ముందుగా ఎవరైతే ఫ్లాగ్‌ని పట్టుకొని ఆ రౌండ్ ఎండ్ బజర్ మోగేవరకూ తమ దగ్గర ఉంచుకుంటారో వాళ్లు ఆ రౌండ్‌లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది.. చివరికి మిగిలిన సభ్యుడు ఈ ఛాలెంజ్ విజేతగా నిలిచి ఓట్ అప్పీల్ కంటెండర్‌గా నిలుస్తారంటూ బిగ్‌బాస్ చెప్పాడు.
మొదటి రౌండ్‌లో గౌతమ్ తల.. విష్ణుప్రియ ముక్కుకి తగలడంతో కాసేపు సైలెంట్ అయిపోయింది విష్ణు. ఇక ఫస్ట్ రౌండ్‌లో నబీల్‌ని, తర్వాత ప్రేరణని.. మూడో రౌండ్‌లో నిఖిల్‌ని తప్పించేశాడు గౌతమ్. అసలు గౌతమ్ ఆట చూస్తే ఖచ్చితంగా తనే గెలుస్తాడని అనిపించింది. ఆ తర్వాత గౌతమ్ చేతిలో నుంచి ఎలాగోలా రోహిణి ఫ్లాగ్ లాక్కుంది. దీంతో స్ట్రాంగ్ ప్లేయర్ అయిన గౌతమ్‌ని తప్పించింది రోహిణి. ఆ తర్వాత అవినాష్ ఫ్లాగ్ అందుకొని విష్ణుని రేసు నుంచి తప్పించాడు. ఇక చివరిగా రోహిణి- అవినాష్ ఇద్దరూ మిగిలారు. అవినాష్ చేతికి ఫ్లాగ్ దొరికిన వెంటనే రోహిణికి ఇచ్చేశాడు. ఎందుకురా ఆడు అంటూ రోహిణి అన్నా కుడా నీ చేతులు బాగోలేదని అన్నావ్‌గా తీసుకో.. నా ఫ్రెండ్ గెలవాలి అంతే.. అంటూ అవినాష్ ఇచ్చేశాడు. దీనికి రోహిణి బాగా ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.
![]() |
![]() |